“అన్నదాత నీకిది తగునా”

సమాజానికి అన్నంపెట్టే అన్నదాతే ప్రజల పాలిట యముడైతే?? అవును మీరు వింటున్నది నిజమే.. రైతు కి అన్యాయం జరిగితే ప్రతీ ఒక్కరు స్పందిస్తారు.. అలాంటి అన్నదాతే మనకు అన్యాయం చేస్తుంటే.. ఇటీవల జాతీయ అధికారులు మన రాష్ట్రం లో కర్నూల్, రాజమహేంద్రవరం లో   చేసిన పరీక్షల్లో కూరగాయలు,పండ్లు మరియు సుగంధ పంటలను పరీక్షించగా మితి మీరిన పురుగుల మందుల అవశేషాలు బయట పడ్డాయట.. గడిచిన దశాబ్ద కాలం నుంచి పెరిగిన పురుగుల మందుల వాడకాల వల్ల ప్రజల్లో అనారోగ్యాల శాతం రోజు రోజు కి పెరిగిపోతుంది.. అల్సర్స్,కిడ్నీ, కాన్సర్ లాంటి ప్రమాదకరమైన  వ్యాధులతో ప్రజల జీవితాలు ఖర్చైపోతున్నాయ్.. ఒకసారి మీరు గమనిస్తే ఇటీవల మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన మామిడి పండ్లు అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించేయటం అప్పట్లో ప్రధాన వార్త గ నిలిచింది.. పురుగుల మందుల వాడకం పై రైతుల కు అవగాహన కల్పించాల్సిన అధికారులు పురుగుల మందుల కంపెనీలు ఇచ్చే లంచం  కాసులకు అమ్ముడైపోయీ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు .. అయితే పురుగుల మందుల వాడకానికి అలవాటు పడిన రైతులు, దిగుబడి పెరగాలనే అత్యాశ తో  కూడా మోతాదుకు మించి  పురుగుల మందుల వాడుతున్నారని కొంత మంది అధికారులు తెలపటం ఆందోళన కలిగించే అంశం.. దీని తీవ్రత నుంచి కొంత వరకు  బయటపడాలంటే కూరగాయలు మరియు పండ్లు వండే ముందు మరియు తినే ముందు ఉప్పు నీటి తో కడుక్కొంటే కొంత వరకు ప్రమాదం నుంచి బయట పడచ్చు అని నిపుణులు చెబుతున్నారు..దయచేసి ప్రజలు గమనించగలరు..

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *