ఆరోగ్యానికి అందమైన సూత్రం…

1. ఆహరం తీసుకునే సమయాల పట్ల అవగాహన..
అసలు మనలో ఎంత మందికి మనం రోజు తీసుకునే ఆహరం ఏ సమయాల్లో తీసుకోవాలి అనే విషయం పై అవగాహనా ఉంది..
అవును మన ఆరోగ్యం కూడా మనం ఆహరం తీసుకునే సమయం పై కూడా ఆదారపడి ఉంది, అది ఎలాగో చూద్దాం..
ఉదయం 7 నుంచి 7:30 లోపు మీరు ఆహరం తీసుకోవాలి..
మధ్యాహాన్నం 12 నుంచి 12:30 లోపు భోజనం తీసుకోవాలి..
సాయంత్రం 6 నుంచి 7 లోపు సాయంత్రం అల్పాహారం..
ఎందుకు అలా తీసుకోవాలి అంటే..
మనం తీసుకునే ఆహరం జీర్ణం కావటానికి (పళ్ళు,మొలకలు అయితే) 4 గంటలు అయితే, ఉడికిన ఆహరం జీర్ణం కావటానికి 6 గంటలు పడుతుంది..
ఉదయం 7 గంటలకు మొదలు పెట్టిన మన ఆహరం తీసుకునే సమయం సాయంత్రం 6 గంటలకు ( సాయంత్రం ఉడికిన ఆహరం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు)..
ముగియటం వల్ల రాత్రి 10 గంటలకు జీర్ణ ప్రక్రియ తన పని పూర్తి చేసుకుంటుంది దాని వల్ల రాత్రి నిద్ర పట్టడం లో ఎటువంటి అంతరాయం కలగదు,దానితో పాటు ఉదయాన్నే కొంత మందికి ఉండే మలబద్దకం సమస్య కొంత వరకు సమసిపోతుంది..
అంతే కాకుండా మన శరీరం లో ఉండే శక్తీ అంత జీర్ణ ప్రక్రియ కే ఎక్కువ సమయం ఇస్తుంటే, మన శరీరం లో సహజ సిద్దమైన రోగనిరోదక శక్తీ దెబ్బతినే అవకాశం ఉంది..
అంటే మన ఆహరం తీసుకునే సమయం పై రోగనిరోదక శక్తి ఆధారపడి ఉంది, అనే విషయం మనకు తప్పకుండ గుర్తు పెట్టుకోవాలి..

Please follow and like us:
0

Sankar Bandla Author

Comments

    Keerthi

    (November 4, 2017 - 12:46 am)

    Super details sir…..Thank u for the information….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *