“ఇదేనా అంబేద్కర్ కోరుకున్నది”

ఏ విగ్రహారాధనని అయితే ఆయన వ్యతిరేకించారో కుళ్ళు రాజకీయాల ఆటలో ఆ మహానుభావుడి విగ్రహాన్ని వాడుకుంటున్నారు, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచి రాజకీయనాయకులు ఆడుతున్న వికృత క్రీడ లో  దళితలే పావులుగా మారిపోతున్నారు.. దేశం లో ఎక్కడ చూసిన ఆయన విగ్రహం కోసం పోటీలే తప్ప అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేవారే కరువయ్యారు.. వందల కోట్లు ఖర్చుపెట్టి విగ్రాహాలను ఏర్పాటు చేయటం మరియు ఆ విగ్రహాలకు పూల మాలలు వేయటం లో పోటీ పడే నాయకులు, ఆ దళితు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్దుల  వసతి గృహాల పరిస్థితి పై ఒక్కరు కూడా నోరుమెదపరు… దేశం లో రాష్ట్రం లో Bc,Sc,St విద్యార్ధుల వసతి గృహాల పరిస్థితి పై కన్నెత్తి చూడని వారు నేడు అంబేద్కర్ స్మృతి వనాల ఖర్చు కి వందల కోట్లు సిగ్గు లేకుండా ఖర్చు చేస్తున్నారు.. దళిత వెనకబడిన వర్గాలు కూడా ఇటువంటి వాటి పై స్పందించకుండా అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదనో లేక విగ్రాహానికి వేలు విరిగిందనో కాలు విరిగిందనో ఉద్యమాలు చేయటం సిగ్గు చేటు.. ఇలాంటివి అన్ని గమనిస్తే ఇదేనా ఆ మహానుభావుడు కోరుకున్నది అనిపిస్తుంది..

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *