“ఇదేనా కాంగ్రెస్ కోరుకుంటున్న ప్రజాస్వామ్యం”

గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో జరుగుతన్న రాజకీయ పరిణామాల పై భారత దేశ మీడియా అవలంభిస్తున్న తీరుని గమనిస్తే. నిజమైన ప్రజాస్వామ్య వాదులు సిగ్గుపడేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి..  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకుంటున్న మన దేశం లో ఇంకా రాచరిక వ్యవస్థ పోలేదా అనే అనుమానం ఇలాంటి పరిణామాలను గమనించిన వారికి ఎవరికైనా అనిపిస్తుంది..ఏమిటా అది  అనుకుంటున్నారా!! అదే  యువరాజు పట్టాభిషేకం, అసలు ఎవరా యువరాజు!! ఎవరికీ యువరాజు?? అని ఆలోచించే వారికి సమాధానం “రాహుల్ గాంధి”.. AICC అధ్యక్షుడిగా రాహుల గాంధీ నియామకాన్ని దేశం లోనే ముఖ్యమైన కార్యక్రమంగా చిత్రీకరించటం లో భారత దేశ పత్రికారంగం లో ఉన్న కొంత మంది భానిసత్వ మీడియా ప్రతినిధులు గాంధీ గారి పేరు ని తోకా గా తగిలించుకున్న మహా మేధావి ని  గాడిద బరువు మోయాటానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు.. ఇప్పటికీ నాలాంటి వారికి అర్ధం కాని విషయం ఏమిటి అంటే.. ఆ పదవి లో రాహుల్ గాంధి ని కాకుండా వేరే ఎవరినైనా కూర్చోబెడితే అది గొప్ప  వార్త అవ్వాలి కాని ఆ మహానుబావుడ్నే కూర్చోబెడితే అది వార్త ఎలా అయ్యిందో కూడా నాలాంటి మట్టి బుర్రలకి అర్ధం కాదు.. కాంగ్రెస్ లాంటి కుటుంబ పార్టీ లు అధికారం లోకి వస్తే వారి అధికార దాహం కోసం ఎంతవరకైన వెళ్తారు… అది ఎమెర్జెన్సి కావచ్చు మరొకటి అయినా కావచ్చు.. అయినా, వారి పార్టీ లో ప్రజాస్వామయం లేదు అనటానికి రాహుల్ గాంధి అధ్యక్షుడు అవ్వటమే పెద్ద ఉదాహరణ.. యువరాజు , పట్టాభిషేకం లాంటి పదాలకు  ప్రజాస్వామ్యం లో ఎక్కడ చోటు ఉందొ  సదరు భానిస మీడియా ప్రతినిధులే శెలవు ఇవ్వాలి… ఇలాంటి పార్టీ లు అధికారం లోకి వస్తే ప్రజలను వారికి భానిసలుగా మార్చి  వారు నిరంకుసపు  మహారాజు లు గా మరియు చక్రవర్తుల్లా పాలన సాగిస్తారు అనటానికి 50 ఏళ్ళు పైగా వారి పాలన చూసిన వారు ఎవరైనా చెబుతారు.. మరి ఇదేనా కాంగ్రెస్ పార్టీ వారు కోరుకుంటున్న ప్రజాస్వామ్యం అని ప్రజలు భావించటం లో తప్పు లేదు అని నా అభిప్రాయం.. చివరగా చెప్పేది ఒక్కటే బంతి పువ్వు పూజకు పనికి రాదు అని పెద్దల చెబుతూ ఉంటారు, ప్రణబ్ గారు వింటున్నారా..

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *