“ఇదేనా పురుషాదిక్య సమాజం”

ఇది కథ కాదు.. నేను చిన్నప్పటి నుంచి చూసిన ఒక మంచి వ్యక్తి జీవితం లో ఎదురైనా సంఘటన.. చాలా మంది పురుషులు ఎదుర్కొంటున్న సమస్య, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం  సందర్భంగా పురుషాదిక్య సమాజం గ పేరొందిన మన సమాజం లో వాస్తవంగా పురుషులు ఎదుర్కొంటున్న సమస్య ను మీ ముందు ఉంచేది ఈ పోస్ట్…పేరు శివా రెడ్డి పేరు కొద్దిగా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్టు కనపడుతున్నా  పాపం ఎటువంటి అలవాట్లు లేని అమాయకుడు.. ఓ విధంగా చెప్పాలంటే చూడటానికి గంభీరంగా ఉన్న మంచితనానికి కేరాఫ్ అడ్రెస్ అన్న మాట..నాకు తెలిసి అంత మంచి మనిషి గా ఉండటం కూడా ఈరోజు ల్లో అతి పెద్ద తప్పు.. లేని ఇంటి పిల్లను పెళ్ళాడాలని ఏరి కోరి అందాన్ని చూసి మోసపోయీ ఒక అమ్మాయిని  పెళ్ళాడాడు.. తనకు ఒక కోటి వరకు ఆస్తి ఉంది కదా అని రూపాయి కట్నం తీసుకోకుండా 10 కాసులు బంగారం పెట్టి పెళ్లి ఖర్చులు కూడా తానే పెట్టుకుని మరీ పెళ్ళాడాడు.. అత్తగారిని  తల్లి కంటే ఎక్కువగా చూసే వాడు కారణం తల్లిని చిన్నప్పుడే  కోల్పోయాడని అనుకునే వాళ్ళం.. కాని మరీ అంత మంచి తనం చేతకాని తనంగా ఆడవారు భావిస్తారని అప్పుడే తెలిసింది.. తన పేరు మీద ఉన్న ఆస్తిని తన భార్య పేరు మీద  పెట్టాలని అత్తగారు ఒత్తిడి తెచ్చింది.. దానికి కూడా వెనకాడలేదు, కాని దానికి కొంత సమయం పడుతుంది అని రిక్వెస్ట్ చేసాడు.. వినలేదు.. కొంత మంది పెద్దవారు ఆపడం తో అప్పుడు మొదలైంది అసలు కథ.. ఇంట్లో చిన్నపాటిదానికే గొడవలు మొదలయ్యాయి.. చివరకు గృహహింస పెట్టె స్థాయికి వచ్చింది.. రూపాయి కట్నం కూడా ఇవ్వకుండా 5 లక్షలకు పోలీస్ స్టేషన్ లో  సెటిల్మెంట్ శివారెడ్డి పెట్టిన బంగారం సైతం తన పుట్టింటి వారు పెట్టరాని అబద్దాలు..  అంత జరిగిన ఆ అమ్మాయే కావాలని కోరుకున్నాడు.. చివరకు విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంది.. ఈ శివారెడ్డి మాత్రం ఆ ఊహల సామ్రాజ్యానికి  అమాయక చక్రవర్తి లా బతుకుతున్నాడు..  అంటే 6 నెలలు కాపురం చేసినందుకు గాను 5 లక్షలు, 10 కాసుల బంగారం తీసుకుంది.. ఇప్పడు చెప్పండి ఆ అమ్మాయిని  ఏమంటారు.. ఒక రాత్రికి తన శరీరానికి వేల కట్టే వ్యభిచారి కి ఈ అమ్మాయికి తేడా ఏముంది.. ఇలాంటి సంఘటనలు  నేను చూసినవి కోకొల్లలు.. ఇలాంటి వారు ఎవరు మీడియా గొట్టాలా ముందు తమకు జరిగిన అన్యాయం కోసం మాట్లాడారు.. మగవారి  చేతుల్లో మోసబోయిన ఆడవారు మీడియా కి ఎక్కుతరేమో కాని ఆడవారి చేతుల్లో మోసబోయిన మగవారు తమ లో తాము కుమిలిపోతారు.. ఎంతైనా పురుషాదిక్య సమాజం కదా.. మగవాడు ఏడుపు వచ్చిన ఏడవలేని పరిస్థితులు..  దయచేసి మగవారికి సైతం మనసు ఉంటుంది అని గ్రహించండి చాలు..

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *