“ఎన్ని గుడి మెట్లు ఎక్కినా గుజరాత్ ప్రజలు హస్తాన్ని ఆదరిస్తారా”

రాజకీయం లో గుజరాత్  ప్రజలది విలక్షణమైన తీరు.. 2002 లో గోద్రా అల్లర్లు కారణంగా దేశ వ్యాప్తంగా మోడీ పేరు మసకబారింది.. NDA మిత్ర పక్షాలు సైతం BJP పై ఒత్తిడి తేవటం తో పార్టీ చెప్పకుండానే  మోడీ ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళటం గతం లో కంటే భారి మెజారిటీ తో గెలుపొందటం తో ఎవరు నోరు తెరవలేని పరిస్థితి.. అయితే ఇప్పటి వరకు కూడా మోడీ ని గోద్రా అల్లర్లను భూచిగా చూపించే ప్రయత్నం చేసినా అక్కడ ప్రజలు మాత్రం మోడీ వెనుకే నిలబడటం ప్రతి పక్షాలకు సైతం మింగుడు పడని విషయం.. తరువాత జరిగే ఏ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ గుజరాత్ లో ఆ అల్లర్ల మాట ఎత్తలేదు, కారణం అక్కడ హిందుత్వం అనేది ఒక భారి ఓటు బ్యాంకు దానిని కదిపితే కష్టం అని వారికి అర్ధమైంది.. మతం ఆధారంగా హిందువులు దేశం లో ఎక్కడ లేని విధంగా గుజరాత్ లో కలిసి కట్టుగా ఉండటానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి.. అంతే కాకుండా మోడీ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కూడా గుజరాత్ అభివృద్ధి పధం లో దూసుకు వెళ్ళింది..  అయితే అది గమనించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుజరాత్ లో అడుగుపెట్టడం మొదలు కనపడిన ప్రతీ గుడి మెట్లు  ఎక్కేస్తున్నాడు.. అయితే ఎన్ని గుడి మెట్లు ఎక్కినా కాంగ్రెస్ లో అక్కడి ప్రజలు హిందుత్వం చూడలేరు  అయితే ఇటీవల దేశం లో జరిగిన కొన్ని పరిణామాలు వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం అది నోట్ల రద్దు కావచ్చు లేక GST దానితో పాటు గుజరాత్ లో జరిగిన కుల సమీకరణాలు కూడా కాంగ్రెస్ కి కలసి రావచ్చు.. అలా కాకుండా గుజరాత్ ప్రజలు కులాన్ని వ్యాపారాన్ని కూడా తమ ధర్మం తర్వాతే అని ఆలోచిస్తే మాత్రం కాంగ్రెస్ మరో 5 ఏళ్ళ వరకు వేచి చూడాల్సిందే.. చూద్దాం కాలం ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో..

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *