“గిరిజనులతో SP చేసే భోజనాలు వెనుక అసలు రహస్యం”

తూర్పుగోదావరి జిల్లా Sp విశాల్ గున్ని గిరిజనులతో సహపంక్తి భోజానాలు చేయటం జరిగింది.. తన విన్నుత్నమైన విధులతో తూర్పుగోదావరి జిల్లా లో  మార్పులు తీసుకువస్తున్న విశాల్ గున్ని మరో పెద్ద సవాల్ కి శ్రీకారం చుట్టారు.. మావోయిస్ట్ లకు స్వర్గాదామంగా నిలిచే జిల్లా అటవీ ప్రాతం లో ఇప్పుడు మళ్లీ వినపడుతున్న మావోయిస్ట్ ల కదలికలు జిల్లా రాజకీయానికి కొంతమేర ఆందోళన కలిగిస్తుంది.. అయితే చాలా కాలం నుంచి మావోయిస్ట్ ల అడుగుల శబ్దాలు  లేక ప్రశాంతంగా ఉన్న జిల్లా అటవీ ప్రాంతం లో మావోయిస్ట్ ల వారోత్సవాల పేరిట జరగబోయే కార్యక్రమలు కొంత అలజడిని సృష్టిస్తుంది..దీనిని ఆది లోనే అంతమొందించాలి అంటే గిరిజనుల సహకారంతోనే సాధ్యమవుతుంది..గతం లో పొలిసు వ్యవస్థలో కొంత మంది చేసిన  తప్పిదాల కారణంగా గిరిజనుల్లో చాలా మంది దళాలలోకి వెళ్లి పనిచేయటం తో పాటు వారికి బహిరంగంగానే సహకరించారు.. అయితే తరువాత తప్పుని తెలుసుకుని గిరిజనులకు దగ్గరయ్యే కార్యక్రమాల తో పాటు వారిలో కొంత మంది యువతను వారికి అనుకూలంగా మార్చుకోవటం మరియు  చాలా మందిని పోలిసులుగా ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టె సరికి  వారిలో గణనీయమైన మార్పు వచ్చింది.. అది గమనించిన కొంత మంది నక్సల్స్ పొలిసు informer నెపం తో గిరిజనులు చంపటం మొదలు పెట్టేసరికి వారికి నక్సల్స్ మద్య దూరం పెరిగింది. పొలిసు వారు చేసే ప్రతీ  భారి encounter లకు మొత్తం సమాచారం ఇచ్చేది గిరిజనులే.. ఇప్పుడు ఆ గిరిజనులకు మరింత దగ్గరయ్యే అవకాశాలను ఏ మాత్రం వదులుకోకుండా ప్రస్తుత sp విశాల్ గున్ని వారితో సహపంక్తి భోజానాలు చేయటం, నక్సల్ సానుభూతి పరుల గుండెల్లో ఆందోళన పెంచుతుంది.. చూడాలి  రాబోయే రోజుల్లో అరణ్య రోదన ఎవరిదీ అవుతుందో..

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *