దత్త జయంతి

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమే దైవ స్వరూపుడైన దత్తాత్రేయ స్వామిగా గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు “ఆత్రేయ” అయింది. “మార్గశీర్ష మాసం శుక్ల పక్ష పౌర్ణమి” నాడు దత్తాత్రేయుని జననం జరిగింది. ఆ రోజునే మనం “దత్తజయంతి”గా జరుపుకుంటాం.
దత్తాత్రేయ జననం:
దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ . అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది.
ఒకసారి త్రిలోక సంచారియైన నారదమహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్లి, అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి యెంతగానో ప్రశంశించాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్భందించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు.”భవతి భిక్షామ్ దేహి” అని ఆ ముగ్గురు అడుగగా అనసూయ బియ్యం, పండ్లు, ఫలహారాలు తీసుకుని వచ్చి వారికి ఇవ్వబోయింది. వారు వాటిని తిరస్కరించి నీవు విరాగిగా, వస్త్రాధికాదులు లేకుండా భిక్ష వేస్తేనే మేము స్వీకరిస్తాము అని చెప్పారు. వస్త్రం ధరించాము అంటే సిగ్గు కలిగి వుండటం.అలా సిగ్గు కలిగి ఉన్నాము అంటే లోక సంబంధమైన వాసనలు ఇతర వాంఛలు అన్ని ఉన్నాయి. అలా ఏ విధమైన వాంఛలు లేకుండా ఉన్నదానివైతేనే నీవు అనసూయవి అని చెప్పారు. “భవతి” అంటే అమ్మ అని అర్ధం.అప్పుడే వెంటనే అనసూయ వారిని త్రిమూర్తులే అని గ్రహించి భర్తకు చెప్పగా ఆయన తన కమండలంలోని నీటిని తీసి అనసూయకి యిచ్చారు. ఆమె ఆ నీటిని తీసుకుని ఆ త్రిమూర్తులపై చల్లగా వారు పసి బాలూరిగా మారిపోయారు. అప్పుడు అనసూయ వివస్త్ర అయి వారికి తన స్తన్యాన్ని భిక్షగా ఇచ్చింది. భర్తలు ముగ్గురూ త్రిలోకాలకి రాకపోయేసరికి ముగ్గురు దేవతలు కంగారుగా అనసూయ వద్దకి వెళ్లి తమ భర్తలను వారికి ఇవ్వమని ప్రార్ధించారు. అత్రి,అనసూయలకి సంతానం లేని కారణంగా త్రిమూర్తులే వారికి సంతానం గా కావాలని కోరారు. వారి కోరిక మేరకు త్రిమూర్తులు మూడు శిరస్సులతో ఒకే దేహంగా మారి దత్తుడిగా వారి చెంతకు చేరారు. దత్తునిగా అత్రి చెంతకు చేరిన వాడు కాబట్టి “దత్తాత్రేయుడు” అంటారు.
శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు. Padmaja Srinivas గారి సౌజన్యం తో

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *