“ప్రతి పక్షాన్ని మింగేయబోతున్న అధికార దాహం”

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయం గమనిస్తే  రాష్ట్రం లో రాజకీయ సునామి రాబోతుందా అనిపిస్తుంది.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే దీనికి పెద్ద ఉదాహరణ.. Ycp అనే పార్టీ భవిష్యత్ లో ఉండదని,అది మూతబడిపోయే కంపెనీ అని రోజుకో ప్రకటన తో అధికార పార్టీ నాయకులు ప్రతి పక్షం పై విరుచుకుపడటం చూస్తే దీనివేనకాల ఒక భారి కుట్ర దాగి ఉందని తేలుతుంది.. అదేమిటి అంటే ఇప్పటికే ప్రతి పక్షం నుంచి అధికార తెలుగు దేశం పార్టీ కి మద్దతుగా మరియు ఆ పార్టీ కండువా కప్పుకున్న ప్రజాప్రతినిధులు 24 మంది శాసనసభ సభ్యులు ౩ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆయితే ఆ సంఖ్య కాస్త 35 మరియు 5 కి గాని వెళితే Ycp పార్టీ మనుగడకే  ముప్పు కలిగే ప్రమాదం ఉందని కొంత మంది  రాజకీయ విశ్లేషకులు అంచనా.. అదే కనుక జరిగితే Ycp పార్టీ మాది అని  ఫ్యాన్ గుర్తు కు జగన్ గారికి సంభందం లేదు అని 35 మంది శాసన సభ్యులు 5 పార్లమెంట్ సభ్యులు న్యాయం స్థానం మెట్లు ఎక్కితే ప్రతి పక్ష నాయకుడికి ఇప్పుడున్న తలపోట్ల తో  మరొక సమస్య పెరిగే అవకాశం ఉంది.. కారణం ఏమిటి అంటే Ycp గెలిచినా 66 మంది శాసనసభ సభ్యులకు గాను మెజారిటీ సభ్యులు ఎటు ఉంటె అదే ycp పార్టీ గా గుర్తింపు పొందే అవకాశాలు ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు..  అయితే ఇందులో అధికార పార్టీ చేస్తున్న కుయుక్తులకు ప్రతి పక్ష పార్టీ శాసనసభ్యులతో పాటు ప్రతి పక్ష నాయకుడు మౌనాన్ని  కూడా గమనిస్తే  సాధారణ ఓటరకు కూడా  రాష్ట్ర రాజకీయాల్లో ఎదో జరగబోతుంది అనే ఆలోచనకు వస్తున్నాడు.. అయితే ఇంత జరుగుతున్న స్పీకర్ తన పాత్ర పోషించటం లో పూర్తిగా విఫలం అయ్యారని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు.. మరి దీనిపై మిగిలిన రాజకీయ పక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.. కాని ఒకటి మాత్రం నిజం, ప్రతి పక్ష పార్టీ ని లేకుండా చేయటం అంటే అర్ధం ప్రజా స్వామ్యం లో ప్రశ్నించే గొంతు ను నోక్కేయటమే.. ఇన్నేళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు చేసే రాజకీయాలు ఇలా ఉండటం బాధాకరం అని మాత్రం చెప్పచ్చు..

Please follow and like us:
0

Sankar Bandla Author

Comments

    Padmaja Srinivas CH

    (December 2, 2017 - 12:04 pm)

    Very gd sankar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *