“మార్గశిర లక్ష్మి వ్రతం”

మార్గశీర్ష గురువారం: “మాసానాం మార్గశీర్షానాం” అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు తన విభూతిని దీనిలో అత్యధికంగా ఉంటుందో చెప్పే సందర్భంలో శ్రీ కృష్ణుడు 12 నెలలలో తాను మార్గశిర మాసం అని చెప్పారు.అంటే భగవంతుడే తనకు తానుగా నేనే ఈ మాసం అని చెప్పుకున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే భగవద్గీత పుట్టింది కూడా ఈ మాసంలోనే. మార్గశీర్షము అనే నక్షత్రం ఏదైతే ఉందొ దాని దగ్గర చంద్రుడు పూర్ణిమ నాడు వుండేటువంటి నెలని మార్గశీర్ష మాసం అంటాము. మార్గశీర్షము అంటే దారికి తలగా ఉండేది. అంటే ప్రధానమైనది. మార్గాన్ని చూపించేది. ఈ మాసం సంవత్సరం అంతటికీ కూడా మార్గాన్ని చూపిస్తుందిట,అంత ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో వచ్చేటటువంటి గురువారాలకి లక్ష్మీ వారాలని పేరు. మన పెద్దలు మనకి పంచ లక్ష్మీ వార పూజ అని చెప్తువుంటారు. అది ఈ మాసంలోనే ప్రారంభం అవుతుంది. అంటే మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం కలిపితే పంచ లక్ష్మీ వారాలకు అవుతాయి. అసలు ఎందుకు ఈ మాసంలో లక్ష్మీ దేవిని పూజించాలి అని అంటే ఈ మాసం ఆ శ్రీమన్నారాయణ నుకి చాలా ప్రీతికరమైన మాసం. అంతే కాకుండా చంద్రుడుకి కూడా ఈ మాసం చాలా ప్రీతికరమైనది. చంద్ర సహోదరి అంటే లక్ష్మీ దేవి. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడు, చంద్రుడు కూడా ప్రసన్నులు అవుతారు. ఈ రోజు లక్ష్మీ దేవిని తులసి మొక్క రూపంలో పూజించడం చాలా మంచిది. వెండి పూలతో పూజించడం మంచిది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కి తులసి చాలా ప్రీతిపాత్రమైనది. చంద్రునికి వెండి చాలా ఇష్టమైనది. అంతే కాకుండా లక్ష్మీ దేవికి ఇష్టమైన ఎరుపురంగు పూవులు, మారువం,ధవనంతో పూజించం కూడా మంచిది. దీనివలన అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం, సంతానం, అన్యోన్యత, సౌభాగ్యం. ఈ రోజు అమ్మవారికి క్షీరాన్నన్ని నివేదన చేయటం మంచిది. Article by Padmaja Srinivas

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *