“మీడియా ఓవర్ ఆక్షన్ పై సోషల్ మీడియా సీరియస్”

రేపు హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ దేశాల పారిశ్రామిక వేత్తల మరియు వాణిజ్య  ప్రతినిధుల సమావేశం కాస్త ఇవాంక పర్యటన గా మార్చేసిన, భారత దేశ మీడియా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీడియా ప్రతినిధుల పై సోషల్ మీడియా వేదికగా విమర్సల వర్షం కురుస్తుంది.. భానిసత్వం నుంచి దేశం బయటపడి 70 ఏళ్ళు అయినా స్వదేశి మీడియా మాత్రం ఇంకా విదేశి సంస్థల కబంద హస్తాల్లోనే ఉన్నది అని కారణం కూడా ఒక్కటే అని ఇక్కడ ఉన్న చాలా మీడియా సంస్థలు విదేశి నిధులతోనే నడుపుతున్నారు అని  సోషల్ మీడియా వాపోతుంది.. ఇవాంకా ఏమి తింటుంది,ఎన్ని గంటలకు లేస్తుంది..ఇవాంకా కుక్క ఏంచేస్తుంది లాంటి జుగుప్సాకరమైన వార్తల ప్రసారం తో విసుగు తెప్పిస్తుంది అంటూ, మీడియా పై సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుంది.. దశాబ్ద కాలంగా మీడియా సంస్థలు నడుపుతూ ఇలాంటి వార్తలు ప్రసారం చేయటానికి ఎక్కడ సిగ్గు పడటం లేదు అని వాపోతున్నారు.. దీనిపై మెరుగైన సమాజం కోసం పని చేసే చానల్స్ స్పందిచాలని కోరుకుందాం..

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *