“రాష్ట్ర భాజాపా లో నాలుగు స్థంభాలాట”

“రాష్ట్ర భాజాపా లో నాలుగు స్థంభాలాట” అవును రాష్ట్ర భాజపా అధ్యక్షడి స్థానం కోసం రాష్ట్ర భాజపా లో నాలుగు స్థంభాలాట కొనసాగుతుంది.. పార్టీ నాయకత్వ భాద్యతలు ఎవరికీ అప్పగిస్తారో అన్నదానికి ఇంకా తెరదించక పోవటంతో కార్యకర్తల్లో అసహనం తో కూడిన గందరగోళం నెలకొని ఉంది.. మోడీ నాయకత్వం లో దేశ వ్యాప్తంగా భాజపా దూసుకు వెళుతున్న ప్రస్తుత తరుణం లో రాష్ట్ర నాయకత్వన్ని నిర్ణయించటం లో మాత్రం పార్టీ పెద్దలు ఇంకా మౌనం వహించటం పట్ల పార్టీ కార్యకర్తలు నిరుత్సాహం తో ఉన్నారు.. Ap లో పార్టీ ఎదుగుదలకి ఇంతకాలం అడ్డంకిగా ఉన్నారన్న అపవాదు ఎదుర్కొన్న ఉన్న వెంకయ్య నాయుడు గారి ని ఉపరాష్ట్రపతి పదవి తో పక్కన పెట్టడం తో ఇక ఆంధ్రప్రదేశ్ భాజప కి మంచి రోజులు రానున్నాయి అని సంభర పడ్డ రు, రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు ఆర్ధికంగా సామాజికంగా బలంగా ఉన్న నాయకత్వం చేతుల్లో పార్టీపెద్దలుఉంచుతారని ఆశపడ్డారు.. అయితే అధ్యక్ష రేసులో సోము వీర్రాజు,గోకరాజు గంగరాజు ఉన్నారు అని  అనుకునే తరుణం లో అనూహ్యంగా రాజమండ్రి శాశన సభ్యులు ఆకుల సత్యనారాయణ గారు రేసు లోకి రావటం రాజకీయ విశ్లేషకులకు సైతం ఒకింత ఆలోచన పడేట్టు చేసింది.. కారణం ఆయనకు సామజిక సమీకరణాలు కలసి రావటం తో పార్టీ ని నడిపే ఆర్ధిక శక్తీ కూడా ఉండటం.. కన్నా లక్ష్మినారాయణ నామ మాత్రపు పేరు గ వినపడుతున్నా గుంటూరు జిల్లా లో బలమైన నాయకత్వంగా పేరు ఉండటం కలిసి వచ్చే అంశం.. అయితే ఇప్పటి వరకు పార్టీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం చూస్తుంటే హరిబాబు గారినే ఈ సంవత్సరం కూడా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించేసి ఈ పర్యాయం కూడా తెలుగు దేశం తోనే నడిచేయటమే మంచిది గా భావిస్తున్నట్టు తోస్తుంది.. అయితే గుజరాత్,హిమచాల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇక్కడ కొత్త ప్రయోగం చేయాల్సిన ఆవశ్యకత ఉందొ లేదో అంచనా వేస్తారని విశ్వసనీయ సమాచారం..

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *