“1996 నవంబర్ 6 గోదావరి జిల్లా గుండె కోత”

“1996 నవంబర్ 6” సమయం 7 గంటలు సచిన్ టెండూల్కర్ నాయకత్వం లో భారత్ సౌత్ ఆఫ్రికా తో టైటాన్ కప్ ఫైనల్ ఆడుతుంది.. ఎంతో టెన్షన్ పడుతూ మ్యాచ్ చూస్తున్నాం.. మా టెన్షన్ మొత్తం ఆరోజు ఆకాశం లో కమ్ముకున్న చీకటి మబ్బుల్లో కనిపిస్తుంది.. ఉన్నట్టు ఉండి ఉరుములు మెరుపులు కరెంటు పోయింది.. ఉదృతమైన గాలి, గుండెలు అదిరిపోయేలా ఉరుములు కళ్ళు చెదిరిపోయేలా మెరుపులు.. ఇప్పట్లో కరెంటు రాదు అని నిర్ణయించుకుని 9 గంటలకే పడుకున్నాను.. ఉదయాన్నే లేచే సరికి సమయం 7 . అమ్మో అంటూ ప్రైవేట్ కి వెళ్ళటం ఆలస్యం అయిపొయింది అని గబా గబా తలుపు తీసి బయటకు వచ్చే సరికి పెరట్లో ఉన్న వేప చెట్టు ఇంటి మీద విరిగి పడి ఉంది.. రోడ్డు మీదకు వచ్చే సరికి ఇది మా ఊరేనా అనిపించింది.. వందల ఏళ్ళ వయసు కలిగిన వృక్షాలు సైతం నెల తల్లిని ముద్దాడు తున్నాయి.. కరెంటు వైర్లు ను మొదటి సారి ముట్టుకున్నాను.. కోనసీమ ను ఆంధ్ర ప్రదేశ్ చిత్ర పటం నుంచి చేరేపెయటానికి ప్రకృతి ప్రయత్నించింది ఆ రోజే .. తరువాత తెలిసింది అదొక భయానక తుఫాన్ అని కోనసీమను గుండె కోతకు గురి చేసిన రోజు.. 250 మందికి పైగా ప్రాణాలు పోగొట్టకున్న ఆ రోజును ఎన్నటికి మరువలేను.. కాని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లో జరిగిన సహాయ కార్యక్రమాలు మాత్రం అద్భుతం నిజంగా..
కొసమెరుపు- భారత్ ఆ ఫైనల్ లో దక్షిణాఫ్రికా పై గెలిచి టైటాన్ కప్ సొంతం చేసుకుంది.
Please follow and like us:
0

Sankar Bandla Author

Comments

    Mahesh

    (November 7, 2017 - 11:31 am)

    That was a nightmare for me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *