“30 ఏళ్ళ క్రితమే రాజమహేంద్రవరం లో భూకబ్జాలకు ప్రయత్నించిన పార్టీ ఏది “

రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం  పేరు గాంచటం లో ఇలాంటి పెద్దల పోరాటాలు,సేవలే ప్రధాన కారణం.. రాజమహేంద్రవరం నగరం కోసం ప్రతీ అణువు అణువు తెలిసిన మహోన్నత వ్యక్తి  ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వై. యెస్ నరసింహారావు గారితో  మా టార్చ్ ముఖా ముఖి.. ఈ ఇంటర్వ్యూ లో పెద్దలు చాలా  విషయాలు మాతో చర్చించటం తో  ఎన్నో  ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.. సూక్ష్మంగా కొన్ని అంశాలు  మీ ముందు..

TORCH- 25 ఏళ్ళ ప్రాయం లోనే  సమాజం కోసం అన్ని ఉద్యమాలు చేసిన మీరు అదే స్థాయి పోరాటపటిమ నేటి తరం లో కొరవడింది అని భావిస్తున్నారా??

YS- అవును, అసలు నేటి తరానికి సమాజం కోసం అంత ఆలోచించే తీరికే లేదు, అయితే అలాంటి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేయటానికి మా కుటుంభ నేపద్యం కూడా ఒక కారణమని చెప్పగలను, మా ముత్తాత గారు వీరేశలింగం పంతులు గారు సమకాలికులు.. ఇద్దరివి విరుద్ధమైన భావాలు (ఒకరు ఆస్తికులు మరొకరు నాస్తికులు) కలిగిన సమాజం కోసం పని చేయటం లో కలిసి కట్టుగా ముందడుగు వేసే వారు.. నా చిన్నతనం లో ప్రకాశం పంతులు గారి స్పర్శ నాలో తెలియని శక్తిని నిద్రలేపింది.. అంతే కాదు వావిలాల గోపాల కృష్ణ గారి లాంటి మహానుభావులు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు.. ఇప్పటి తరానికి అలాంటి వారిని స్మరించుకోవటం కూడా తెలియటం లేదు,దానికి ప్రస్తుత సామాజిక పరిస్థుతులు కూడా ఒక కారణంగా చెప్పచ్చు..

TORCH- మాజీ ప్రధాని PV నరసింహారావు గారు శాశ్వత సభ్యత్వం తీసుకునే స్థాయిలో ఒక సంస్థ ను ఏర్పాటు చేసిన మీరు ఇప్పుడు అంతే స్థాయిలో కార్యక్రమాలు చేయటం లో విఫలం అయ్యారని భావిస్తున్నారా??

YS- విఫలం అంటే?? ఇప్పుడు అంతే స్థాయిలో కార్యక్రమాలు జరగటం లేదు అని మాత్రం చెప్పగలను, జరగాలని కూడా కోరుకోవటం లేదు.. అప్పుడు నేను చేసిన ఉద్యమాలు చాలా బలమైనవి ఇప్పుడు నగరం లో  అంతే స్థాయిలో చేయటానికి ఎవరు అంత సాహసం కూడా చేయలేరు..

TORCH- మీరు చేసినవి కొన్ని మాతో పంచుకోగలరా??

YS- అప్పుడు అత్యంత  శక్తీ వంతమైన  నగర శాశన సభ సభ్యులు ఒకరు గౌతమీ గ్రంధాలయం,దామెర్ల ఆర్ట్ గ్యాలరి, రాళ్ళ బండి సుబ్భారావు మ్యుజియం ఆస్తులు అన్యాక్రాంతం చేయాలనే దుర్బుద్ధితో వాటిని తెలుగు యూనివర్సిటీ లో కలపాలని ప్రయత్నించారు.. దానికి ప్రాణాలకు తెగించి మరీ అడ్డు కున్నాము..దానికి నన్ను ఉద్యోగపరంగా కూడా చాల ఇబ్బండులుకు గురిచేసారు.. దానికి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామా రావు గారు కూడా మద్దతు తెలపటం బాధించిన అంశం.. అయినా వెనక్కి తగ్గకుండా పోరాడటం తో వారు వెనక్కి తగ్గారు..

TORCH- ముఖ్యమంత్రి,ప్రధాన మంత్రి, చివరకు రాష్ట్రపతి నుంచి కూడా సత్కారాలు అందుకున్న మీరు రాజకీయాల లోకి రావాలని ఎందుకు అనుకోలేదు.

YS- నాకు ముందు నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి లేదు, సమాజానికి సేవ చేయాలంటే రాజకీయాలు ఒక్కటే మార్గం కాదు అని బలంగా నమ్ముతాను.. అంతే కాదు రాజకీయాల లోకి వస్తే ఖచ్చితంగా ఒకరికి తలవంచాలి,తప్పుడు పనులు చేయాలి, ఆ రెండు నాకు చేతకాదు.. అందుకే ప్రజా సేవకు ఆ రంగాన్ని నేను ఎంచుకోలేదు..

TORCH- మీ తరం లో ఉండే యువత కు ఈ తరం యువతకు తేడా చెప్పాల్సి వస్తే ఏమని చెబుతారు..

YS- “సామాజిక బాధ్యత” మేము అని స్థాయి నుంచి నేను అనే స్థాయికి నేటి యువత వచ్చేసింది.. నేర్చుకోవాలి అనే ఆసక్తి  కాని సమాజం కోసం సమస్యల పట్ల పోరాడాలి అనే తపన కాని నేటి యువతకు లేదు.. కాని ఇప్పుడిప్పుడే కొంత మార్పు రావటం మొదలైంది..

TORCH- సాంస్కృతిక రాజధానిగా పేరు గాంచిన మన నగరాన్ని ఆ వైపుగా మన నాయకులు నడిపిస్తున్నారు అని మీరు భావిస్తునరా??

YS- లేదు భావించటం లేదు.. ఎవరికీ కనీసం మన నగర చరిత్ర పై కనీస అవగాహన కూడా  లేదు..ప్రతీ వేదిక పై నాయకులతో  ఆ విషయం పైనే చర్చిస్తూ ఉంటున్నా.. అయినా వారికి మన నగర చారిత్రక సంపదను ఎలాగైనా  కాపాడుకోవాలని అనిపించకపోవటం బాధాకరం..అమరావతి కాంటే కూడా పురాతమైన బౌద్ద చరిత్ర మన నగరానికి ఉంది..1800 ఏళ్ళ క్రితం నాటి శివలింగం నంది బయట పడ్డాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.. వాటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మన నాయకులకు లేదు..

TORCH- దేశం లోనే ఎక్కడ లేని విధంగా మహిళా స్వాతంత్ర్య సమరయోదురాళ్ళ పార్క్ రాజమండ్రి లో నిర్మించటానికి గల కారణం..

YS- దేశం లోనే కాదు ప్రపంచం లోనే ఎక్కడ లేదు.. కారణం ఒక్కటే స్వతంత్ర సంగ్రామం లో మన నగరం నుంచి మాత్రమే అంత మంది  మహిళా మణులు ఉద్యమం లో పాల్గొన్నారు.. జైలు జీవితం గడిపారు  అంతాటి చరిత్ర మన నగరానిది..

TORCH-  వారి కుటుంభాల నుంచి మీకు మద్దతు ఏమైనా ఉందా ఈ పార్క్ నిర్మాణం లో!!

YS- చెప్పుకుంటే సిగ్గు చేటు వారిలో చాలమంది వారసులకు ఇప్పటికీ తెలియదు వారి పూర్వీకుల ఉద్యమ చరిత్ర.. అప్పటి ఉద్యమాలలో  అవసరమైతే మెడ లోంచి  తాళి బొట్టులు సైతం తీసి ఇచ్చిన మహిళా మూర్తుల కుటుంభ సభ్యులు ఇప్పుడు కనీసం విగ్రహాలను ప్రతిష్ట చేసినప్పుడు పిలిచినా రాలేదు.. ఎక్కడ ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుందో అని.. కాని బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఆ వారసులు పేకాట క్లబ్బులకు దారబోసే దానిలో పైసా వంతు కాదు ఇది..

TORCH- ఇప్పటి వరకు మీరు చూసిన ప్రధాన మంత్రులలో మీకు నచ్చిన వారు ఎవరు అంటే ఏమని చెబుతారు..

YS- PV నరసింహారావు గారిని మించిన వారు లేరు రారు.. ఆయనకు రెండు నిమిషాలు ఖాళి సమయం దొరికినా పుస్తాకాలు చదువుతారు.. సిద్దాంత పరంగా ఆయన్ని విభేదించే వారు సైతం ఒక సమస్య పై విశ్లేషణ చేస్తూ కథనం రాస్తే అది కూడా వదలకుండా చదివేవారు.. ఆయనొక నిత్యవిదార్ది..

TORCH-  చివరగా యువతరానికి మీరిచ్చే సందేశం..

YS- నేర్చుకోండి.. సమాజాన్ని అతి దగ్గర నుంచి చూసేవారు మాత్రమే  సమస్యల పై స్పందిచగలరు.. అది కేవలం నేర్చుకోవటం ద్వారానే సాధ్యపడుతుంది.. అలాంటి వారు చేసే ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యలను పరిష్కరించటం లో విజయం సాదించగలరు..

మా టార్చ్ టీం ని అభినందిస్తూ శెలవు తీసుకున్నారు..

 

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *