“మార్గశిర లక్ష్మి వ్రతం”

మార్గశీర్ష గురువారం: “మాసానాం మార్గశీర్షానాం” అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు తన విభూతిని దీనిలో అత్యధికంగా ఉంటుందో చెప్పే సందర్భంలో శ్రీ కృష్ణుడు 12 నెలలలో తాను మార్గశిర మాసం అని చెప్పారు.అంటే భగవంతుడే తనకు తానుగా నేనే ఈ మాసం అని చెప్పుకున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే భగవద్గీత పుట్టింది కూడా ఈ మాసంలోనే. మార్గశీర్షము అనే నక్షత్రం ఏదైతే ఉందొ దాని దగ్గర చంద్రుడు పూర్ణిమ నాడు వుండేటువంటి నెలని మార్గశీర్ష మాసం అంటాము. మార్గశీర్షము […]

దత్త జయంతి

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమే దైవ స్వరూపుడైన దత్తాత్రేయ స్వామిగా గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు “ఆత్రేయ” అయింది. “మార్గశీర్ష మాసం శుక్ల పక్ష పౌర్ణమి” నాడు దత్తాత్రేయుని జననం జరిగింది. ఆ రోజునే మనం “దత్తజయంతి”గా […]

“1996 నవంబర్ 6 గోదావరి జిల్లా గుండె కోత”

“1996 నవంబర్ 6” సమయం 7 గంటలు సచిన్ టెండూల్కర్ నాయకత్వం లో భారత్ సౌత్ ఆఫ్రికా తో టైటాన్ కప్ ఫైనల్ ఆడుతుంది.. ఎంతో టెన్షన్ పడుతూ మ్యాచ్ చూస్తున్నాం.. మా టెన్షన్ మొత్తం ఆరోజు ఆకాశం లో కమ్ముకున్న చీకటి మబ్బుల్లో కనిపిస్తుంది.. ఉన్నట్టు ఉండి ఉరుములు మెరుపులు కరెంటు పోయింది.. ఉదృతమైన గాలి, గుండెలు అదిరిపోయేలా ఉరుములు కళ్ళు చెదిరిపోయేలా మెరుపులు.. ఇప్పట్లో కరెంటు రాదు అని నిర్ణయించుకుని 9 గంటలకే పడుకున్నాను.. […]

కార్తీక పౌర్ణమి

కార్తీక మాసం లో పౌర్ణమికి చాల ప్రాధాన్యత ఉంది ఈ మాసం లో శుక్ల పక్షం లో వచ్చే పౌర్ణమిని కార్తీక పొర్ణమి అని అంటారు..ఈ మాసానికి కార్తిక అని పేరు రావడానికి కూడా ఈ పౌర్ణమే కారణం చంద్రుడు ఈ పౌర్ణమి నాడే కృత్తిక నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు.. ఈరోజు చంద్రుని వెలుగు మిగతా పౌర్ణమి కంటే ప్రకాశవంతంగా ఉంటుంది..ఈరోజు చేసే దీపారాధన కు ఒక ప్రత్యేకత ఉంది.. ఈరోజు 365 రోజులతో చేసే దీపారాధన […]

“రాష్ట్ర భాజాపా లో నాలుగు స్థంభాలాట”

“రాష్ట్ర భాజాపా లో నాలుగు స్థంభాలాట” అవును రాష్ట్ర భాజపా అధ్యక్షడి స్థానం కోసం రాష్ట్ర భాజపా లో నాలుగు స్థంభాలాట కొనసాగుతుంది.. పార్టీ నాయకత్వ భాద్యతలు ఎవరికీ అప్పగిస్తారో అన్నదానికి ఇంకా తెరదించక పోవటంతో కార్యకర్తల్లో అసహనం తో కూడిన గందరగోళం నెలకొని ఉంది.. మోడీ నాయకత్వం లో దేశ వ్యాప్తంగా భాజపా దూసుకు వెళుతున్న ప్రస్తుత తరుణం లో రాష్ట్ర నాయకత్వన్ని నిర్ణయించటం లో మాత్రం పార్టీ పెద్దలు ఇంకా మౌనం వహించటం పట్ల […]

విశ్లేషణ

ఏ గూటి పక్షి ఆ గూటి పలుకులే పలుకు అన్నట్టు, నేటి మీడియా మేధావుల విశ్లేషణలు కాస్తా తమకు అనుకూల వర్గాల కోసం అక్షరాన్ని సైతం తాకట్టు పెట్టేసి నిజాలను దాచేస్తున్నారు.. ఇలాంటి విశ్లేషణ లు ప్రజల ఆలోచనల పై కూడా ప్రభావాన్ని చూపటమే కాకుండా వారి మనస్సులో విష భీజలు నాటడం జరుగుతుంది.. కులం,మతం,ప్రాంతం,వర్గాలకు అతీతంగా మా విశ్లేషణ లు కొనసాగిస్తామని అమ్మలాంటి అక్షరం పై ప్రమాణం చేస్తున్నాము.. Please follow and like us:0

Keep Sharing more